: మోదీ ప్ర‌సంగాన్ని ప్ర‌సారం చేయం.. స్ప‌ష్టం చేసిన బెంగాల్ విద్యాశాఖ‌

షికాగోలోని ప్రపంచ మత మహాసభల్లో స్వామి వివేకానంద ప్రసంగించి సెప్టెంబ‌ర్ 11 నాటికి 25 ఏళ్లు పూర్తికావొస్తున్న సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌త్యేకంగా ప్ర‌సంగించనున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌సంగాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా దేశంలోని అన్ని విశ్వ‌విద్యాల‌యాలు, క‌ళాశాల‌ల్లో ప్ర‌సారం చేయాల‌ని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) ఆదేశించింది. అయితే ఈ ప్ర‌సంగాన్ని ప‌శ్చిమ బెంగాల్‌లోని విద్యాల‌యాల్లో ప్ర‌సారం చేయ‌బోమ‌ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్ధ ఛటర్జీ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ అనుమ‌తి లేకుండా ఇలాంటి ప్ర‌సంగాల‌ను ప్రసారం చేయలేమని కోల్‌కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న పేర్కొన్నారు. యూజీసీ నోటీసుల మేర‌కు ప‌శ్చిమ బెంగాల్‌లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విద్యాశాఖ‌ను ఆశ్రయించాయ‌ని, అయితే యూజీసీ నోటీసులను తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం లేద‌ని వారికి స్ప‌ష్టం చేసిన‌ట్లు మంత్రి తెలియ‌జేశారు. గతంలో కూడా ఇదే విధంగా మోదీకి సంబంధించి కార్యక్రమాలను ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం వ్య‌తిరేకించిన సంఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి.

More Telugu News