dasari arun kumar: మెగా హీరోకి విలన్ గా దాసరి తనయుడు!

దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్ చాలా కాలం క్రితమే హీరోగా ట్రై చేశాడు. హీరోగా సక్సెస్ ను సాధించలేకపోయిన ఆయన, ఆ తరువాత కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించాడు. అవి కూడా పెద్దగా గుర్తింపు తీసుకురాకపోవడంతో సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చాడు.

 అలాంటి అరుణ్ కుమార్ నటన పట్ల మళ్లీ ఆసక్తిని కనబరుస్తున్నాడు. విలన్ గా చేయడానికి కూడా తాను సిద్ధంగానే వున్నానని ఆ మధ్య ఒక సందర్భంలో చెప్పిన ఆయన, త్వరలో విలన్ గానే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అల్లు శిరీష్ కథానాయకుడిగా దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఒక సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అరుణ్ కుమార్ విలన్ గా కనిపించనున్నాడట. ఈ సినిమాతో ఈ తరహా పాత్రలు తనకి ఎక్కువగా వస్తాయని ఆయన భావిస్తున్నాడని అంటున్నారు. విలన్ గా ఆడియన్స్ ను ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి మరి.    

More Telugu News