: టీటీడీ ఛైర్మన్ గా పారిశ్రామికవేత్త రవిశంకర్?.. హరికృష్ణకు నిరాశేనా?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ పదవి కోసం నందమూరి హరికృష్ణతో పాటు పలువురు ప్రముఖులు పోటీ పడుతున్నారు. అయితే, వ్యాపారవేత్త రవిశంకర్ నియామకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ రోజు జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ నియామకానికి సంబంధించిన జీవో జారీకానుంది. ఈ నేపథ్యంలో, ఈ పదవిపై ఎంతో ఆశ పెట్టుకున్న హరికృష్ణకు నిరాశ ఎదురుకానుంది.

చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన రవిశంకర్ ఓ బడా పారిశ్రామికవేత్త. టీటీడీ ఛైర్మన్ గా ఆయన ఎంపికైతే... ఏడాది కాలం పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. 19 మందితో కూడిన పాలకమండలిలో బోర్డు సభ్యులుగా సుధా కృష్ణమూర్తి, కోలా ఆనంద్, చింతల రామచంద్రారెడ్డి, రాఘవేంద్రరావు, ఎమ్మెల్యే కొండబాబు, కృష్ణమూర్తి లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఎండోమెంట్ కమిషనర్ వైవి అనురాధ తదితరులు ఉంటారు. 

More Telugu News