Samanta: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  'అన్నీ కలసి వస్తే ఇక్కడ రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చు..' అంటోంది చెన్నయ్ బ్యూటీ సమంత. 'నాకు అలాగే కలసి వచ్చాయి. నా శ్రమకు అదృష్టం తోడైంది. అందుకే ఓవర్ నైట్ లో స్టార్ ఇమేజ్ వచ్చింది. అయితే, ఇదే అందరికీ జరుగుతుందని, ఇదే శాశ్వతమని అనుకోకూడదు' అని చెప్పింది సమంత.      
*  తాజాగా తెలుగులో విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తున్న 'అర్జున్ రెడ్డి' చిత్రం కన్నడ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
*  ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న 'జై లవ కుశ' చిత్రంలో కథానాయిక తమన్నా స్పెషల్ సాంగు చేయనుంది. ఈ పాటను త్వరలో ఎన్టీఆర్, తమన్నాలపై హైదరాబాదులో సెట్స్ లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం తనకు స్పెషల్ అని తమన్నా కామెంట్ చేసింది.
*  గత ఏడాది 'పెళ్లిచూపులు' చిత్రాన్ని విడుదల చేసి ఘన విజయాన్ని సాధించిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తాజాగా 'మెంటల్ మదిలో' అనే రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈమేరకు చిత్ర నిర్మాత రాజ్ కందుకూరితో ఆయన డీల్ చేసుకున్నట్టు సమాచారం.  

More Telugu News