: ఉచిత వాయిస్ కాల్స్ సౌక‌ర్యం అందించ‌నున్న ఎయిర్‌టెల్?

ప్ర‌ముఖ టెలికాం రంగ దిగ్గ‌జ సంస్థ భార‌తి ఎయిర్‌టెల్.. రిల‌య‌న్స్ జియో బాట‌లోనే ముందుకు వెళుతోంది. వ‌చ్చే వారం నుంచి ఎయిర్‌టెల్ కూడా 4జీ అడ్వాన్స్డ్ టెక్నాల‌జీ అయిన‌ వాయిస్ ఓవర్ ఎల్టీఈ ( VoLTE) కాల్స్ ను ప్ర‌వేశ‌పెట్ట‌నుందని ఎక‌నామిక్స్ టైమ్స్ పేర్కొంది. జియో ఇప్ప‌టికే ఈ టెక్నాల‌జీని అందిస్తోన్న విష‌యం తెలిసిందే. మొద‌ట ముంబై, కోల్‌క‌తాల‌తో పాటు దేశంలోని మెట్రోపొలిట‌న్ సిటీల్లో ఎయిర్‌టెల్ ఈ స‌ర్వీసుల‌ను ప్రారంభించ‌నుంది. 4జీ డేటా నెట్‌వ‌ర్క్ ఆధారంగా VoLTE కాల్స్‌ను చేసుకునే అవ‌కాశం ఉండ‌డంతో ఇక ఎయిర్‌టెల్ కూడా ఉచిత కాల్స్ స‌దుపాయాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై ఎయిర్‌టెల్ నుంచి అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ సౌక‌ర్యాన్ని అందిస్తోన్న ఏకైక కంపెనీగా ముకేశ్ అంబానికి చెందిన రిల‌య‌న్స్‌ జియో మాత్ర‌మే ఉంది.     

More Telugu News