allari naresh. nikhila vimal: ఆ డైలాగ్ గురించి రానా ఫోన్ చేశాడు: అల్లరి నరేశ్

అల్లరి నరేశ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'మేడ మీద అబ్బాయి' సినిమా .. ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ లో ఒక డైలాగ్ వుంది. "మేటర్ లేనోడికి మేటర్ లేదని చెప్పాలి గానీ .. నువ్ దగ్గుబాటి రానా అని నెట్టకూడదు" అంటాడు నరేశ్. ఈ డైలాగ్ విషయం రానా చెవిన పడటంతో ఓ రోజున ఆయన అల్లరి నరేశ్ కి ఫోన్ చేశాడట.

 " ఇంతకీ తనలో మేటర్ వుందంటావా .. లేదంటావా బాబాయ్ " అంటూ అల్లరి నరేశ్ ను అడిగేశాడట. ఈ విషయాన్ని రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'నెం.1 యారి' విత్ రానా కార్యక్రమానికి హాజరైన అల్లరి నరేశ్ చెప్పాడు. రానాతో తనకి ఎంతో సాన్నిహిత్యం ఉందనీ, అందుకే సరదాగా ఆ డైలాగ్ పెట్టామని అన్నాడు. ఆ డైలాగ్ పాజిటివ్ ఫీలింగ్ నే ఇస్తుందంటూ చెప్పుకొచ్చాడు. తాను కూడా ఈ డైలాగ్ ను సరదాగానే తీసుకున్నానని నవ్వుతూ రానా చెప్పాడు.  

More Telugu News