: స్టడీ టూర్ కు వెళ్లి సముద్రంలో కలసిపోయిన ఇద్దరు ప్రతిభావంతులు!

ఇద్దరు తెలివైన విద్యార్థులు, స్టడీ టూర్ కు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, మికా యూనివర్శిటీకి చెందిన 47 మంది విద్యార్థులు క్రాఫ్టింగ్ కమ్యూనికేషన్ కార్యక్రమంలో భాగంగా గోవాకు వెళ్లారు. వీరంతా కండోలిం బీచ్ కు వెళ్లగా, గుర్రంచెందు సాయి జ్ఞానేశ్వర్, అనూజా సుసాన్ పాల్ లు సముద్రంలో సరదాగా గడిపేందుకు వెళ్లి కొట్టుకుపోయారు.

దీనిని గమనించిన ఇతర విద్యార్థులు కేకలు పెట్టడంతో స్థానికుల సాయంతో అంజు మృతదేహాన్ని, ఆపై 5 గంటల తరువాత జ్ఞానేశ్వర్ శరీరాన్ని గుర్తించారు. వారిని చూసిన సహచర విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. నిన్న పౌర్ణమి కావడంతో తెల్లవారుఝామున వీరంతా సముద్రతీరానికి వెళ్లారని, వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని వర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది. వీరిద్దరూ ఎంతో తెలివైనవారని, చదువులో రాణిస్తున్నారని, జరిగిన దుర్ఘటనపై పిల్లల తల్లిదండ్రులకు సమాచారాన్ని ఇచ్చామని వర్శిటీ అసోసియేట్ డీన్ సిద్దార్థ్ దేశ్ ముఖ్ తెలిపారు. వర్శిటీకి ఈ ఘటన తీవ్ర విషాదకరమైనదని అన్నారు.

More Telugu News