: వాట్సాప్ లాస్ట్ సీన్ వివ‌రాలు ఫేస్‌బుక్‌కి తెలుసు!

2014లో వాట్సాప్‌ను ఫేస్‌బుక్ చేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. వారి ఒప్పందంలో భాగంగా వినియోగ‌దారుడి ఫోన్ నెంబ‌ర్‌, స్మార్ట్‌ఫోన్ వివ‌రాలు, రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ల‌తో పాటు లాస్ట్ సీన్ వివ‌రాల‌ను కూడా ఫేస్‌బుక్‌కి అంద‌జేస్తున్న‌ట్లు వాట్సాప్ తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లు త‌మ వ్య‌క్తిగ‌త వివ‌రాల ర‌క్ష‌ణ విధానాలపై నివేదిక‌ను అత్యున్న‌త న్యాయ‌స్థానానికి స‌మ‌ర్పించాయి.

వినియోగ‌దారుల ప్రాథ‌మిక వివ‌రాల‌ను మాత్ర‌మే ఇత‌ర సంస్థ‌ల‌కు తెలియ‌జేస్తామ‌ని, వారు మాట్లాడుకున్న స‌మాచారం వివ‌రాల‌ను వెల్ల‌డించ‌బోమని నివేదిక‌లో తెలిపాయి. ఇటీవ‌ల వ‌చ్చిన పిటిష‌న్ల మేర‌కు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల‌ వ్య‌క్తిగ‌త వివ‌రాల ర‌క్ష‌ణ విధానాలు ఎంత‌వ‌ర‌కు సుర‌క్షిత‌మో తెలియ‌జేయాల‌ని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై న‌వంబ‌ర్‌లో పూర్తి విచార‌ణ కొన‌సాగించ‌నున్న‌ట్లు స‌మాచారం.

More Telugu News