mehreen: మెహ్రీన్ హవా మొదలయ్యేలానే వుంది!

'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాతో హిట్ అందుకున్న మెహ్రీన్ యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాత ఈ సుందరి ఒప్పుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటున్నాయి. త్వరలో ఆమె సినిమాలు ప్రేక్షకుల ముందుకు వరుసగా రానున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా క్రేజ్ వున్న కథానాయకుల సరసన చేసినవి కావడం విశేషం.

ముందుగా శర్వానంద్ తో చేసిన 'మహానుభావుడు' విడుదల కానుంది. ఆ తరువాత రవితేజ సరసన చేసిన 'రాజా ది గ్రేట్' .. సాయిధరమ్ తేజ్ తో జోడీకట్టిన 'జవాన్' .. సందీప్ కిషన్ కాంబినేషన్లో చేస్తోన్న 'కేరాఫ్ సూర్య' ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు పట్టాలెక్కుతున్నాయి. వీటిలో ఏ రెండు సినిమాలు హిట్ కొట్టినా, మెహ్రీన్ హవా మొదలుకావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

More Telugu News