: భారత సైన్యంపై దాడికి పాక్ మరో కుట్ర.. పసిగట్టిన నిఘా సంస్థలు

సీమాంతర ఉగ్రవాదాన్ని అలవాటుగా మార్చుకున్న పాక్.. భారత సైన్యంపై దాడికి మరో ఎత్తుగడ వేసింది. పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీం (బ్యాట్)లోని సుశిక్షుతులైన వారితో వాస్తవాధీన రేఖ వెంబడి దాడులకు సిద్ధమైన విషయాన్ని భారత నిఘా సంస్థలు పసిగట్టాయి.

‘బ్యాట్‌’ దళాలు జిహాదీ గ్రూపులతో కలిసి వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న కశ్మీర్ లోయలో దాడులు చేసేందుకు పథక రచన చేసినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం జాతీయ రహదారులను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. పుల్వామా, అనంతనాగ్, కుప్వారా, శ్రీనగర్, బారాముల్లా, కుల్గామ్ తదితర ప్రాంతాల్లో దాడుల కోసం వ్యూహం రచించినట్టు నిఘావర్గాల సమాచారం. సోమవారం క్వీజీగుండ్ ప్రాంతంలో సీఆర్‌పీఎప్ దళాలపై దాడి సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదంపై తీవ్రస్థాయిలో పోరాడుతున్న భారత్ ఇటీవల ఉగ్రవాదులను పెద్ద ఎత్తున హతమారుస్తుండడంతో రూటుమార్చిన పాక్ ఏకంగా సైన్యంతోనే దాడులకు దిగాలని వ్యూహం రచిస్తోంది.

More Telugu News