allu arjun: బన్నీ షూటింగులో జాయినైన స్టార్ కమెడియన్!

అల్లు అర్జున్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో, 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కొన్ని రోజులుగా అక్కడ ప్రధానమైన పాత్రలకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ రోజున ఈ సినిమా షూటింగులో వెన్నెల కిషోర్ జాయిన్ అయ్యాడు.

బన్నీ .. వెన్నెల కిషోర్ కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను తెరకెక్కించనున్నారట.  ఈ ఇద్దరూ కలిసి తెరపై నవ్వుల పువ్వులు పూయించనున్నారన్న మాట. ఈ సినిమాలో బన్నీ కొత్త లుక్ తో .. మరింత ఫిట్ నెస్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఈ సినిమా ఆమె కెరియర్ కి బాగా హెల్ప్ అవుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  

More Telugu News