: డేరా బాబా రాకతో నానా ఇబ్బందులు పడుతున్న 1500 మంది ఖైదీలు

అత్యాచార కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ రోహ్ తక్ లోని సునియారా జైల్లో ఊచలు లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, డేరాబాబా రాకతో అక్కడున్న 1500 మంది ఖైదీలు నానా అవస్థలు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే, డేరా బాబా వచ్చినప్పటి నుంచి జైల్లో బందోబస్తును భారీగా పెంచారు. అంతేకాదు గతంలో మాదిరి లోపల ఖైదీలు తిరిగేందుకు అవకాశం కూడా అధికారులు ఇవ్వడం లేదు.

బాబా రాక ముందు ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు బ్యారక్ ల బయట తిరిగేందుకు అవకాశం ఉండేది. అంతేకాదు, ఖైదీలను కలిసేందుకు వచ్చేవారికి కూడా డేరా బాబా వల్ల నిరాశ ఎదురవుతోంది. తమ వారిని చూసుకునేందుకు వచ్చినవారు... వారిని చూడకుండానే వెనుదిరగాల్సి వస్తోంది. దీంతో, జైల్లోని ఖైదీలంతా డేరా బాబాను వేరే జైలుకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. 

More Telugu News