: 'ఒత్తిడిని తగ్గిస్తుంది.. మీరూ ఆడండి!' అంటూ యునిసెఫ్ వారి `న‌గ్గెట్‌` గేమ్‌ను ప్ర‌చారం చేస్తున్న ప్రియాంక చోప్రా

యునిసెఫ్ కు అంత‌ర్జాతీయ గుడ్‌విల్ అంబాసిడ‌ర్‌గా ఉన్న ప్రియాంక చోప్రా, యువ‌త కోసం వారు త‌యారు చేసిన నగ్గెట్ అనే వీడియోగేమ్ గురించి విప‌రీతంగా ప్ర‌చారం చేస్తోంది. యువకుల మొబైల్ ఫోన్ లో ఈ `నగ్గెట్` గేమ్ లేకపోతే, అసలు వారి మొబైల్ ఫోన్ మొబైలే కాదని కూడా ప్రియాంక ప్రచారం చేస్తోంది. ఈ గేమ్ ప్రచారానికి సంబంధించి ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్లలో వీడియోలు కూడా పోస్ట్ చేసింది.

వివిధ ప‌నుల కార‌ణంగా ఒత్తిడి బారిన ప‌డుతున్న యువ‌త‌కు ఈ గేమ్ ద్వారా ఒత్తిడిని దూరం చేసుకునే అవ‌కాశం క‌లుగుతుంద‌ని, తాను కూడా ఈ ఆట‌ను ఆడు‌తున్నాన‌ని ప్రియాంక‌ పేర్కొంది. బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్ ఆడ‌టం వ‌ల్ల ఈ మ‌ధ్య చాలా మంది చిన్నారులు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. వారంతా ఆ గేమ్ సృష్టించే మాన‌సిక ఒత్తిడి కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నార‌ని విశ్లేష‌కులు తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే వారి ఒత్తిడిని దూరం చేసేందుకు `న‌గ్గెట్‌` గేమ్‌ను యునిసెఫ్ రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. ప్రియాంక ప్రచారం ప్రారంభించిన కొద్దిసేప‌ట్లోనే ఈ గేమ్ డౌన్‌లోడ్ల సంఖ్య పెరిగింది. దీంతో ప్రియాంక వెంట‌నే డౌన్‌లోడ్ చేసుకున్న వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ మ‌రో పోస్ట్ పెట్టింది.

More Telugu News