nani: బాలీవుడ్ కి 'నిన్ను కోరి' .. నాని పాత్రలో వరుణ్ ధావన్!

నాని కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'నిన్నుకోరి' ఒకటి. ఈ సినిమా ఆయనకి సూపర్ హిట్ ను ఇవ్వడమే కాకుండా, నటుడిగా మరో మెట్టుపైకి ఎక్కించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నివేదా థామస్ కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి కీలకమైన పాత్రను పోషించాడు. అలాంటి ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

 ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించిన కోన వెంకట్ .. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలి మధ్య ఇటీవలే చర్చలు జరిగాయట. ఈ సినిమా చూసిన సంజయ్ లీలా బన్సాలి .. హిందీలో రీమేక్ చేయడానికి అంగీకరించాడని అంటున్నారు. తెలుగులో నాని చేసిన పాత్రను 'వరుణ్ ధావన్' చేసే ఛాన్స్ వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం వుంది.     

More Telugu News