: మా కంపెనీల్లో 'డ్రీమర్'లు ఉండాల్సిందే... వలసదారుల పిల్లలకు అండగా నిలిచిన టిమ్ కుక్, జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల

అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకు వచ్చిన డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్ - తల్లిదండ్రులతో కలసి చిన్న వయసులో అమెరికాకు వచ్చి ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని గెంటివేసే కార్యక్రమం)పై దిగ్గజ ఐటీ కంపెనీలు తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి. సుమారు 8 లక్షల మందిపై ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని డ్రీమర్ విభాగంలోనే ఉన్న ప్రముఖ ఐటీ కంపెనీల చీఫ్ లు మార్క్ జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల తదితరులు డిమాండ్ చేశారు. వీరంతా విదేశాల నుంచి చిన్న వయసులో అమెరికాకు వచ్చి స్థిరపడిన వారేనన్న విషయం తెలిసిందే.

తమ కంపెనీల వృద్ధికి డ్రీమర్లు ఎంతో సహకరించారని, వారి ద్వారా అమెరికా కూడా లాభపడిందని, వారంతా అమెరికన్లతో సమానమేనని యాపిల్ చీఫ్ టిమ్ కుక్, తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ విషయంలో ట్రంప్ ను అడ్డుకోవడంలో కాంగ్రెస్ సభ్యులు విఫలమైతే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వుంటుందని స్పష్టం చేశారు. తమ ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు కట్టుబడివున్నామని, మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో ఎవరిని దేశం నుంచి బహిష్కరించాలని చూసినా, కోర్టులను ఆశ్రయిస్తామని, అందుకయ్యే ఖర్చునంతా సంస్థ భరిస్తుందని తెలిపారు. ఇక గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైతం ఈ విషయమై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

More Telugu News