: బహిష్కరణ భయంతో వణికిపోతున్న 20 వేలకు పైగా అమెరికన్ భారతీయులు!

బాల్యంలో చట్ట విరుద్ధంగా అమెరికాలో ప్రవేశించి (తల్లిదండ్రుల ద్వారా), అక్కడ చదువుకుని, అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్న స్వాప్నికులను (డ్రీమర్స్) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం వణికిస్తోంది. డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్ (డీఏసీఏ) ప్రోగ్రామ్ ను రద్దు చేయాలన్న ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో ఉన్న లక్షలాది మందికి డిపోర్టేషన్ (బహిష్కరణ) భయం పట్టుకుంది.

ట్రంప్ తీసుకోనున్న నిర్ణయం 20 వేల మందికి పైగా భారతీయులపై కూడా ఈ ప్రభావం పడనుందని 'సౌత్ ఏషియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్' సంస్థ అంచనా వేసింది. ఇప్పటి వరకు 5,500 మంది భారతీయులు, పాకిస్థానీలు డీఏసీఏను పొందారు. వీరికితోడు 17 వేల మంది భారతీయులు, 6 వేల మంది పాకిస్థానీలు డీఏసీఏకు అర్హులు. ఈ తరుణంలో డీఏసీఏ నిషేధంతో వీరంతా బహిష్కరణకు గురవుతారు. మొత్తం మీద వివిధ దేశాలకు సంబంధించి దాదాపు 8లక్షల మందిపై బహిష్కరణ కత్తి వేలాడుతోంది. దీంతో వీరంతా భయంతో వనకిపోతున్నారు. 

More Telugu News