అక్టోబర్ నుంచి రంగంలోకి 'సైరా నరసింహా రెడ్డి'

06-09-2017 Wed 09:03
'సైరా నరసింహా రెడ్డి' సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం మెగాస్టార్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును అక్టోబర్ రెండవ వారం నుంచి మొదలు పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకసారి షూటింగ్ మొదలైన తరువాత షెడ్యూల్స్ మధ్య పెద్దగా గ్యాప్ వుండకుండా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.

 ప్రస్తుతం సెట్స్ నిర్మాణం పనులను ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ .. కాస్ట్యూమ్స్ డిజైనర్ అంజూ మోడీ తమ పనులను మొదలెట్టేసినట్టుగా తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అమితాబ్ .. నయనతార .. సుదీప్ .. విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలను పోషిస్తుండటం, ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.