Shruti Hassan: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  మొదట్లో సినిమాల కోసం డైటింగ్ చేస్తూ నా సహజత్వాన్ని కోల్పోయాను.. అంటోంది కథానాయిక శ్రుతి హాసన్. "సినిమాలలోకి వచ్చిన కొత్తలో నా ఫిగర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టేదానిని. ఎక్కడ బరువు పెరిగిపోతానో అని భయపడుతూ, దాని మీదే ఎక్కువగా దృష్టి సారించాను. దీంతో నా సహజత్వాన్ని కోల్పోయాను. ఆ తర్వాత విషయం తెలుసుకుని నాకు నేనుగా వుండాలని నిర్ణయం తీసుకున్నాను. లావుగా ఉన్నంత మాత్రాన అందంగా లేనట్టు కాదని గ్రహించాను. లావుగా వున్నా, సన్నగా వున్నా అందంగా కనిపించాలంతే' అని చెప్పింది.
*  మహేశ్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'స్పైడర్' చిత్రం బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది. ఈ క్రమంలో కృష్ణా జిల్లా ప్రదర్శన హక్కులు 5.4 కోట్లకు అమ్ముడుపోయినట్టు తాజా సమాచారం. ఆ జిల్లాకు సంబంధించి ఇది ఒక రికార్డు రేటని అంటున్నారు.
*  అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న రెండో చిత్రం 'హలో' షూటింగ్ నాన్ స్టాప్ గా సాగుతోంది. ఈ చిత్రంలో అఖిల్ ఓ పాట కూడా పాడాడు. 'మనం' ఫేం విక్రంకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేస్తారు.  

More Telugu News