dulkar salman: అందుకే 'మహానటి' సినిమాను ఒప్పుకున్నా : దుల్కర్ సల్మాన్

మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా దుల్కర్ సల్మాన్ దూసుకుపోతున్నాడు. ఆయనతో కలిసి నటించడానికి హీరోయిన్స్ పోటీపడుతుంటారు. అనువాదాల ద్వారా తెలుగు .. తమిళ ప్రేక్షకులకు కూడా ఆయన పరిచయమే. రొమాంటిక్ హీరోగా కనిపించే దుల్కర్ కి ఈ మూడు భాషల్లోను అభిమానులు వున్నారు. అలాంటి దుల్కర్ మొదటిసారిగా 'మహానటి'తో నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాడు.

 ఈ సినిమాను గురించి ఆయన మాట్లాడుతూ, ఇందులో తాను జెమినీ గణేశన్ పాత్రను పోషిస్తున్నట్టుగా చెప్పాడు. నేరుగా తెలుగు సినిమా చేయాలనే ఆసక్తి తనకి ఉన్నప్పటికీ, ఈ సినిమా ఒప్పుకోవడానికి అదొక్కటే కారణం కాదని అన్నాడు. దర్శకుడు నాగ అశ్విన్ తపన చూసి తాను ఈ సినిమా చేయడానికి అంగీకరించానని చెప్పాడు. ఈ సినిమాను ఆయన అద్భుతంగా తెరకెక్కిస్తాడనే నమ్మకం తనకి ఉందని అన్నాడు.  

More Telugu News