charan: చరణ్ ఎటూ తేల్చుకోలేక పోతున్నాడట!

ప్రస్తుతం చరణ్ .. సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఆ తరువాత సినిమా తనకి చేసిపెట్టమని చరణ్ ను దానయ్య అడుగుతున్నారట. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకుడిగా వ్యవహరించే అవకాశం వుంది.

అయితే చిరూ 151వ సినిమాగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చారిత్రక నేపథ్యంతో కూడుకున్నది కావడం వలన, ఈ సినిమా పూర్తి కావడానికి ఏడాదైనా పడుతుంది. అప్పటివరకూ నిర్మాతగా ఆ సినిమా వ్యవహారాలే చూసుకుంటూ ఉండాలా? ఒక వైపున ఆ సినిమా పనులు చూసుకుంటూనే మరో వైపున దానయ్య - బోయపాటి కాంబినేషన్లోని సినిమా చేయాలా? అనే విషయంలో చరణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట.     

More Telugu News