: లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసిన కోహ్లీ!

రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేసి ఓ భారీ షాట్ కొట్టాడు. ఆశ్చర్యం కలుగుతోంది కదా! ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీయే చెప్పాడు. చెప్పడమే కాదు..ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. అయితే, కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లో కాదు..శ్రీలంక గల్లీ క్రికెట్ లో!

 శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా, లంక జట్టుతో త్వరలో జరగనున్న టీ 20 మ్యాచ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ జరగడానికి ఇంకా మూడు రోజుల టైమ్ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలంక గల్లీలో అక్కడి పిల్లలతో కోహ్లీ సరదాగా కాసేపు క్రికెట్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన కోహ్లీ ..‘నాట్ బ్యాడ్ ఫర్ ఏ లెఫ్ట్ హ్యాండెడ్ షాట్’ అనే ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు.

More Telugu News