: ప్రసిద్ధ యూఫో ఆలయాన్ని తరలించే ప్రాజెక్టు చేపట్టిన చైనా

సాధారణంగా ఆలయాల్లో మరమ్మతులు చేపడతారు. ఆలయాలను పునరుద్ధరిస్తారు. కానీ చైనా మాత్రం అసాధారణంగా ఒక ఆలయాన్ని తరలించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇలా ఆలయాన్ని తరలించడం చైనాలో ఇదే తొలిసారి. షాంఘైలో ప్రసిద్ధి చెందిన యూఫో ఆలయం ఉంది. ఇది 135 ఏళ్లనాటి పురాతన ఆలయం. దీనిని జేడ్ బౌద్ధాలయంగా పిలుస్తారు. ఇందులో మూడు భారీ బుద్ధ విగ్రహాలున్నాయి. 18 మీటర్ల ఎత్తైన ఆ ఆలయాన్ని, విగ్రహాలతో పాటు రెండు వారాల్లో తరించే బృహత్తర ప్రాజెక్టును చైనా ప్రభుత్వం చేపట్టింది.

 ఆలయం ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి ఉత్తర దిశగా 30.66 మీటర్లు జరుపుతారు. అలాగే భద్రతా కారణాల రీత్యా ఎత్తును 1.05 మీటర్లు పెంచనున్నారు. తొలి రోజు కేవలం 2 మీటర్ల దూరం మాత్రమే జరపనున్నారు. మరుసటి రోజు నుంచి రోజూ 6 మీటర్ల చొప్పున ఉత్తరదిశకు తరలిస్తారు. అదే సమయంలో రోజూ 0.3 మీటర్ల ఎత్తు పెంచుకుంటూ వెళ్తారు. ఇలా వారం రోజులపాటు సమర్థవంతంగా పని చేస్తే ఆలయ తరలింపు పూర్తవుతుందని, తరువాతి వారం రోజులు ఆలయాన్ని అక్కడ స్థిరంగా ఉంచే ఏర్పాట్లు చేస్తారు. 

More Telugu News