: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనకు ఏపీ ప్రభుత్వం సరికొత్త పరిష్కారం.. తెలంగాణ ప్రభుత్వం ఏమంటుందో?

ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించి సామరస్య పూర్వకంగా పంచుకునేందుకు చంద్రబాబు సర్కారు ముందుకొచ్చింది. ఏపీ భవన్‌లో గోదావరి, శబరి, పటౌడీ అనే మూడు బ్లాకులున్నాయి. ఇందులో 72 గదుల గోదావరి బ్లాక్‌ను కానీ, ఐదు సూట్ రూములు కలిగిన శబరి బ్లాక్‌ను, రెండు కాటేజీలను తెలంగాణకు ఇవ్వాలని నిర్ణయించింది.

పటౌడీ బ్లాక్‌ను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని ప్రతిపాదించింది. అధికారులు చేసిన ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించినట్టు ఏపీ సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఏపీ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్‌కు లేఖ రాశారు. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌దే తుది నిర్ణయమని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.

More Telugu News