: ట్రంప్ చేతిలో ఒబామా పెట్టిన లేఖలో ఏం రాశారో తెలుసా?

అమెరికా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే సమయంలో అధ్యక్షుడికి మాజీ అధ్యక్షుడు ఒక లేఖను చేతిలో పెడుతుంటారు. అది వైట్ హౌస్ సంప్రదాయం. ఈ లేఖలో పలు సూచనలు ఉంటాయి. ఈ సంప్రదాయాన్ని బరాక్ ఒబామా కూడా పాటించారు. అధ్యక్ష స్థానం నుంచి దిగిపోయిన తరువాత ట్రంప్ కు ఒక లేఖను ఇచ్చారు. ఇలా మాజీ అధ్యక్షుడు ఇచ్చే లేఖను ప్రస్తుత అధ్యక్షుడు పదవి నుంచి దిగిపోయే వరకు బయటపెట్టరు. అయితే సంప్రదాయానికి భిన్నంగా ట్రంప్ పదవి చేపట్టిన ఎనిమిది నెలలకే ఆ లేఖను శ్వేతసౌథం సందర్శకులకు చూపించారు. దానిని ఒక వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేయడంతో అది వైరల్ అవుతోంది.

ఈ లేఖలో ఏముందంటే...‘నాతో సహా పార్టీలకతీతంగా లక్షలాది మంది మీపై ఆశలు పెట్టుకున్నారు. ఇది (శ్వేతసౌధం) ఓ అద్వితీయమైన కార్యాలయం. ఇక్కడ విజయం కోసం ముందుగా నిర్ణయించిన మార్గాలేవీ ఉండవు. కాబట్టి నేను ఇచ్చే సలహాలు మీకు పనికొస్తాయో లేదో నాకే తెలీదు’ అని పేర్కొన్నారు. ‘మన ఇద్దరినీ వేర్వేరు మార్గాల్లో అదృష్టం వరించింది. విజయానికి బాటలు వేయడానికి మనం ఏం చేయగలమనేది మన చేతుల్లోనే ఉంటుంది. అలాగే ప్రపంచానికి అమెరికా నాయకత్వం వహించడం అనివార్యం. దానిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ ఒబామా సలహా ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News