: మ‌రో దుందుడుకు చ‌ర్య‌కు ఉ.కొరియా రెడీ.. ఈ సారి 50 టన్నుల అణుపరీక్ష

అణ్వాయుధ ప‌రీక్ష‌లు జ‌రుపుతూ క‌ల‌క‌లం రేపుతోన్న‌ ఉత్తర కొరియా ప్ర‌పంచ దేశాల నుంచి హెచ్చ‌రిక‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ త‌న మొండి వైఖ‌రిని మార్చుకోవ‌డం లేదు. రెండు రోజుల క్రితమే హైడ్రోజన్‌ బాంబును పరీక్షించి తీవ్ర విమ‌ర్శ‌ల‌కు గురైన ఉత్త‌ర‌కొరియా మరో ఖండాంతర అణుక్షిపణిని (ఇంటర్‌ కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిసైల్‌-ఐసీబీఎం) పరీక్షించేందుకు ఏర్పాటు చేసుకుంటోంది. దక్షిణ కొరియా సైనిక వర్గాలు ఈ విష‌యంపై మాట్లాడుతూ... ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మరో పరీక్షకు సిద్ధమవుతున్నట్లు త‌మ‌కు తెలిసింద‌ని చెప్పాయి. ఉత్తర కొరియా ఇప్ప‌టికే ఆరు సార్లు అణుపరీక్షలు నిర్వహించింది. 

More Telugu News