ranveer: 'అర్జున్ రెడ్డి' రీమేక్ పై ఆసక్తి చూపుతోన్న బాలీవుడ్ హీరో!

తెలుగు .. తమిళ భాషల్లో హిట్ కొట్టే చిత్రాలపై బాలీవుడ్ హీరోలు ఓ కన్నేసి ఉంచుతుంటారు. కంటెంట్ ఏ మాత్రం నచ్చేసినా రీమేక్ లో చేయడానికి సన్నాహాలు చేస్తుంటారు. అలా ప్రస్తుతం రణవీర్ సింగ్ .. 'అర్జున్ రెడ్డి' సినిమాపై దృష్టి పెట్టాడని అంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో ఒక రేంజ్ లో క్రేజ్ వున్న హీరోల్లో రణవీర్ సింగ్ కూడా వున్నాడు.

 'అర్జున్ రెడ్డి' గురించి విన్న రణవీర్ సింగ్ .. ఆ సినిమా టీజర్ ..  ట్రైలర్ చూశాడట. ఇక ఈ సినిమా కంటెంట్ పై వచ్చిన వివాదాలను గురించి కూడా తెలుసుకున్నాడని సమాచారం. ఈ సినిమా పై రణవీర్ ఆసక్తిని చూపుతుండటంతో, బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ స్పెషల్ స్క్రీనింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నాడట. సినిమా చూసి నచ్చితే రీమేక్ లో చేయడానికి రణవీర్ సింగ్ ఓకే చెప్పొచ్చనే టాక్ వినిపిస్తోంది. మరి రణవీర్ సింగ్ ఏమంటాడో చూడాలి మరి.       

More Telugu News