: మళ్లీ తండ్రి కాబోతున్న బ్రిటన్ యువరాజు!

బ్రిటన్ యువరాజు విలియం మూడోసారి తండ్రి కానున్నారు. విలియం సతీమణి, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి కేథరిన్ మిడిల్ టన్ మూడోసారి తల్లి కాబోతున్న విషయాన్ని కెన్సింగ్టన్ ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. ఈ వార్తతో రాజకుటుంబీకులు చాలా ఆనందంగా ఉన్నారు. కాగా, ప్రస్తుతం మార్నింగ్ సిక్ నెస్ (వేవిళ్లు)తో బాధపడుతున్న కేథరిన్ మిడిల్ టన్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, విలియం-కేథరిన్ మిడిల్ టన్ దంపతులకు 2013 జులైలో తొలిబిడ్డ ప్రిన్స్ జార్జికి, 2015  మే లో రెండో బిడ్డ ప్రిన్సెస్ చార్లెట్ ఎలిజబెత్ డయానా జన్మించింది.

More Telugu News