: 29 బీరు గ్లాసుల‌తో 40 మీటర్లు న‌డిచి రికార్డు సృష్టించిన జ‌ర్మ‌న్ వ్య‌క్తి

ఒకేసారి అతి ఎక్కువ బీరు మ‌గ్గుల‌ను చేతుల్తో ప‌ట్టుకుని, 40 మీట‌ర్లు న‌డిచి జ‌ర్మ‌నీకి చెందిన ఆలివ‌ర్ స్ట్రంఫెల్ రికార్డు సృష్టించాడు. బ‌వ‌రియా ప్రాంతానికి చెందిన ఆలివ‌ర్ గ‌తంలో 25 గ్లాసుల‌తో ఉన్న త‌న రికార్డును తానే బ్రేక్ చేశాడు. 31 బీర్ల‌తో న‌డుస్తుండ‌గా చివ‌రి నిమిషంలో రెండు గ్లాసులు కింద‌ప‌డ‌టంతో 29 గ్లాసులుగా రికార్డు న‌మోదు చేశారు. ఈ 29 గ్లాసుల బ‌రువు క‌లిపి 69 కేజీలుగా ఉంద‌ని రికార్డు న‌మోదులో పేర్కొన్నారు. ఈ రికార్డు సాధించ‌డం కోసం గ‌త ఫిబ్ర‌వ‌రి నుంచి వారానికి నాలుగు సార్లు జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న‌ట్లు ఆలివ‌ర్ తెలిపాడు. త్వ‌ర‌లోనే ఈ రికార్డును కూడా బ్రేక్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని ఆలివ‌ర్ చెప్పాడు.

More Telugu News