mahesh babu: 'భరత్ అను నేను' హక్కులకు భారీ క్రేజ్

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా హిందీ ఆల్ రైట్స్ 13 కోట్లకి అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. 'బాహుబలి'ని మినహా ఇస్తే మరే సినిమాకి ఈ స్థాయి రేటు రాలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కి కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయట.

 ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను 18 నుంచి 20 కోట్లకు దక్కించుకోవడానికి రెండు భారీ సంస్థలు పోటీ పడుతున్నాయట. ఈ హక్కులను ఎవరు సొంతం చేసుకుంటారనేది రెండు మూడు రోజుల్లో తెలియనుంది. గతంలో కొరటాల - మహేశ్ కాంబినేషన్లో వచ్చిన 'శ్రీమంతుడు' భారీ విజయాన్ని అందుకోవడం, కొరటాల వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తూ రావడం ఈ స్థాయి రేటు పలకడానికి ప్రధానకారణంగా చెప్పుకుంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.          

More Telugu News