: వైద్యులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న బుడతడు... !

నెలలు నిండకుండా బిడ్డ జన్మిస్తే పలు సమస్యలు చుట్టుముడుతుంటాయి. కొంత మంది ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ గా మిగిలిపోతారు. ఇంకొందరు తొందరగానే కాలం చేస్తుంటారు. అరుదైన కేసుల్లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్జాగా బతికేస్తారు. అమెరికాలోని వెస్ట్రన్ పెన్సుల్వేనియాలోని పిట్స్ బర్గ్ లో ఇయాన్, రెలిన్ స్కర్రీలకు కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. తొలి సంతానంగా పాప జన్మించింది. మళ్లీ 2016లో ఆమె గర్భం దాల్చింది. ప్రసవానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉండడంతో తన కుమార్తెను గాడ్ మదర్ దగ్గర ఉంచేందుకు కారులో బయల్దేరింది. అలా బయల్దేరిన కాసేపటికే కడుపు నొప్పి ప్రారంభమైంది. దీంతో వేగంగా కుమార్తెను దించి, వెనుదిరిగింది.

ఇంతలో నొప్పులు పెరగడంతో ఆసుపత్రివైపు కారును తిప్పింది. అంతలోనే ఆమెకు డెలివరీ అయిపోయింది. బిడ్డ ఆమె చేతిలో పడినప్పుడు రక్షణ పొర (తల్లి గర్భంలో ఉన్నప్పుడు అటూ ఇటూ కదలడానికి, ఒత్తిడి నుంచి రక్షణగా, ఆహారం, శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది) తో ఉన్నాడు. దీనిని ఆమె ఫోటో తీసింది. ఇప్పుడు ఆ బాబు క్షేమంగా ఉండడంతో ఐదు రోజుల క్రితం ఫోటోను ఆమె తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడు నెలల ముందే జన్మించిన శిశువులు బతకడం అరుదుగా జరుగుతుందని...ప్రతి 80,000 కేసుల్లో మాత్రమే ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. 

More Telugu News