balakrishna: ఆ మూవీ చేయకుండా వుంటే బాగుండేది : బాలకృష్ణ

సాధారణంగా స్టార్ హీరోలు తమ క్రేజ్ కి తగిన కథలనే ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళుతుంటారు. ఈ క్రమంలో కొన్ని సూపర్ హిట్ అయితే మరికొన్ని ప్లాప్ అవుతుంటాయి. దాంతో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్లు తమ కెరియర్ ను కొనసాగిస్తూ వుంటారు. అయితే ఫలానా సినిమాను తాను అనవసరంగా చేశాననీ .. ఆ మూవీ చేయకుండా ఉండాల్సిందని వాళ్లకి అనిపించే సందర్భాలూ ఉంటాయి.

అలా అనిపించిన సినిమా ఏదైనా మీ కెరియర్లో వుందా? అనే ప్రశ్న తాజాగా బాలకృష్ణకి ఎదురైంది. అంతే .. ఆయన ఎంత మాత్రం తడుముకోకుండా 'ఒక్క మగాడు' సినిమా అని తేల్చి చెప్పారు. వైవీఎస్ చౌదరి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, 2008లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిమ్రాన్ .. అనుష్క కథానాయికలుగా నటించిన ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. ఆ సినిమాను చేయకుండా ఉండాల్సిందని అనిపిస్తూ ఉంటుందని బాలకృష్ణ చెప్పారు. ఈ సినిమా ఆయనకి అంతటి చేదు అనుభవాన్ని మిగిల్చిందన్న మాట.     

More Telugu News