: భార‌త్ మాట‌కు క‌ట్టుబ‌డిన బ్రిక్స్ దేశాలు... తీవ్రవాదానికి వ్య‌తిరేకంగా డిక్ల‌రేష‌న్

చైనాలోని గ్జియామెన్‌లో జ‌రుగుతున్న బ్రిక్స్ స‌మావేశాల్లో ఉగ్ర‌వాదాన్ని రూపుమాపాలంటూ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చెప్పిన‌ మాట‌ల‌కు మిగ‌తా బ్రిక్స్ దేశాలు మ‌ద్దుతినిచ్చాయి. బ్రిక్స్ కూట‌మి దేశాల్లోనూ, ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న అన్ని ర‌కాల ఉగ్ర‌దాడుల‌ను ఖండిస్తూ, దాన్ని అణ‌చివేయ‌డానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌తిపాదిస్తూ ఓ ఉమ్మ‌డి డిక్ల‌రేష‌న్‌ను జారీ చేశాయి. తాలిబాన్, ఐఎస్ఐఎల్‌, అల్ ఖ‌యిదా తీవ్ర‌వాద సంస్థ‌లు, వాటి అనుబంధ సంస్థ‌లైన హ‌ఖ్ఖానీ నెట్‌వ‌ర్క్‌, ల‌ష్క‌ర్ ఎ తొయిబా, జైషే ఎ మ‌హ్మ‌ద్‌లు సృష్టిస్తున్న విధ్వంసాన్ని ఖండిస్తున్న‌ట్లు ఈ డిక్ల‌రేష‌న్‌లో బ్రిక్స్ దేశాలు స్ప‌ష్టం చేశాయి. అలాగే ఉత్త‌ర కొరియా చేస్తున్న అణుప‌రీక్ష‌ల‌పై కూడా విచారం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు డిక్ల‌రేష‌న్‌ పేర్కొంది. తీవ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న దేశాల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి ఐక్య‌రాజ్య‌స‌మితి సాధార‌ణ స‌భ స‌హాయం చేయాల‌ని బ్రిక్స్ దేశాలు కోరాయి.

More Telugu News