: గిన్నిస్ కెక్కిన అతిపెద్ద సమోసాను ఇలా తయారు చేశారు... వీడియో చూడండి!

ప్రపంచంలోనే అతి పెద్ద సమోసాను ఇంగ్లాండ్‌ కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ గత నెలలో తయారు చేసిన సంగతి తెలిసిందే. 153.1 కేజీల ఈ భారీ సమోసా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. లండన్ లోని ఒక అపార్ట్ మెంట్ లో 12 మంది పాకశాస్త్ర నిపుణులు 15 గంటలపాటు కష్టపడి...44 కేజీల మైదాపిండి, భారతీయ సుగంధ ద్రవ్యాలు, 100 కేజీల బంగాళా దుంపలు, 25 కేజీల ఉల్లిపాయలు, 15 కేజీల బఠానీలతో దీనిని తయారు చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను గిన్నిస్ నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ గా మారింది. దానిని మీరు కూడా చూడండి.

More Telugu News