: పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవాలి: బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్

చైనాలో మూడు రోజుల బ్రిక్స్ సదస్సు ప్రారంభమైంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల అధినేతలు ఈ సదస్సుకు చైనాలోని జియామెన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బ్రిక్స్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ సమావేశంలో చైనా అధ్యక్షుడు మాట్లాడుతూ, ఒక భారీ భవన నిర్మాణం పునాదితో ప్రారంభమవుతుందని అన్నారు. మనం పునాది వేశామని, కూటమిలో సహకారానికి ఓ రూపం ఇచ్చామని అన్నారు. అయినప్పటికీ ఆయా దేశాల పరిస్థితులు, చరిత్ర, సంస్కృతుల వల్ల సహకారంలో తలెత్తిన సమస్యలను అధిగమించి పరస్పర విశ్వాసాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

బ్రిక్స్‌ సహకారాన్ని కేవలం ఐదు దేశాలకే పరిమితం చేయరాదని ఆయన సూచించారు. చైనా-పాక్‌ మధ్య నిర్మిస్తున్న ఎకనామిక్‌ కారిడార్‌ ను ప్రస్తావించిన జిన్ పింగ్, ఆ ప్రాజెక్టును తాము భౌగోళిక రాజకీయ అజెండాతో చేపట్టలేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు అన్ని దేశాలకు లబ్ది చేకూరుస్తుందని ఆయన అన్నారు. కాగా, ఈ సదస్సుకు ఈజిప్టు, కెన్యా, తజకిస్థాన్‌, మెక్సికో, థాయ్‌ లాండ్‌ దేశ ప్రతినిధులను ఆయన ఆహ్వానించారు. 

More Telugu News