Anushka: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించడానికి తనకు హీరోలే స్ఫూర్తి అంటోంది స్వీటీ అనుష్క. "మన సినిమాలను మొదటి నుంచి చివరి దాకా మోసేది మన హీరోలే. కథ, పాటలు, ఫైట్స్ అన్నీ వాళ్ల చుట్టూనే తిరుగుతాయి. అంతటి భారాన్ని మోస్తారు మన హీరోలు. అందుకే, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల విషయంలో వాళ్లే నాకు స్ఫూర్తి" అని చెప్పింది.          
*  నాగశౌర్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'కణం' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేస్తారు.
*  'ప్రేమమ్' చిత్రం తర్వాత నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో 'సవ్యసాచి' పేరిట ఓ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగును ఈ నెల 20న ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
*  తమిళ స్టార్ విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న 'అదిరింది' (తమిళంలో మెర్సిల్) చిత్రాన్ని దీపావళికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్, సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు.          

More Telugu News