Tapsi: తాప్సీ రెండో ఇల్లు కొంటుందట!

హీరోయిన్లయినా, హీరోలైనా తాము బిజీగా వుండి, నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్న తరుణంలో తమకంటూ ఓ సొంత ఇంటిని కొనుక్కుంటారు. దక్షిణాది సినిమాలు కూడా చేసే బాలీవుడ్ భామలైతే ముంబయ్ లోను, హైదరాబాదు, చెన్నయ్ లలో కూడా ఫ్లాట్లు కొనేసుకుంటున్నారు. ఒక విధంగా రియల్ ఎస్టేట్ లో వారికి ఇదో రకం ఇన్వెస్ట్ మెంట్ కూడా! ఇక సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ తాను ఢిల్లీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ, ఇప్పటికే ముంబయ్ లో ఫ్లాట్ కొనుక్కుంది.

అక్కడి అంధేరీ ధనిక ప్రాంతంలో రెండు బెడ్రూంల ఫ్లాట్ కొంది. అయితే, తాప్సీకి బాగా విశాలమైన .. చుట్టూ పచ్చదనంతో కూడిన పెద్ద ఇల్లు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో పెద్ద ఆశ. ముంబయ్ లో అయితే అంత పెద్ద ఇల్లు కొనలేమని, అందుకే హైదరాబాదులో అలాంటిది కొంటానని అంటోంది. ప్రస్తుతం అమ్మడు ఆ పనిలోనే వుందట. తనకి ఇంటీరియర్ డెకరేషన్ కూడా తెలుసు కాబట్టి, చాలా అందంగా తన అభిరుచి మేర ఆ ఇంటిని డిజైన్ చేయించుకుంటానని చెబుతోంది.   

More Telugu News