: ఇస్రో రాకెట్ వైఫల్యానికి కారణం 'బరువే': డైరెక్టర్ శివకుమార్

గత ఆగస్టు 31న సాయంత్రం ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ 39 ప్రయోగం విఫలం కావడానికి కారణం అధిక బరువని ఇస్రో శాటిలైట్‌ సెంటర్‌ మాజీ డైరెక్టర్‌ శివకుమార్‌ తెలిపారు. ‘ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్ -1హెచ్‌’ ఉపగ్రహ ప్రయోగం విఫలం కావడంపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధిక బరువు కారణంగా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టే క్రమంలో పీఎస్‌ఎల్వీ నిర్ణీత వేగంతో ప్రయాణించలేకపోయిందని అన్నారు.

సుమారు టన్ను బరువు పెరిగిందని ఆయన తెలిపారు. ఈ రాకెట్ గరిష్టంగా 20,650 కిలోమీటర్ల దూరంలోని అపోజీ కక్ష్యలోకి దూసుకెళ్లాల్సి ఉండగా, అధిక బరువు కారణంగా కేవలం ఆరు వేల కిలో మీటర్ల దూరం మాత్రమే వెళ్లగలిగిందని ఆయన తెలిపారు. రాకెట్ లోని అన్ని దశల ఇంజన్లు సక్రమంగానే పని చేశాయని చెప్పిన ఆయన, ఉష్ణకవచం మాత్రం వేరుపడలేదని తెలిపారు. 

More Telugu News