samanta: 'రాజుగారి గది 2'లో సమంతా లుక్ అదిరింది!

ఇప్పటివరకూ గ్లామర్ ప్రధానమైన పాత్రల్లో అల్లరి పిల్లగా కనిపిస్తూ వచ్చిన సమంతా, 'రాజుగారి గది 2'లో ఒక విభిన్నమైన పాత్ర చేసింది. ఆ పాత్రకి సంబంధించిన లుక్ ను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేసింది. నిజం చెప్పొద్దూ .. ఈ లుక్ అదిరిందంతే. ఈ స్టిల్ లో.. ఒక రకమైన భయం వెంటాడుతున్నట్టుగా ఆమె కళ్లను చూస్తే తెలిసిపోతోంది.

ఈ సినిమాలో తన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమంతా చెప్పింది. తాను ఈ తరహా పాత్రను చేయడం ఇదే మొదటిసారి అనీ .. ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని అంది. నాగార్జున ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, సమంతాతో పాటు శీరత్ కపూర్ కూడా కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ నెల 20 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి, అక్టోబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.         

More Telugu News