pavan: పవన్ .. త్రివిక్రమ్ మూవీ: టైటిల్ 'అజ్ఞాత వాసి'?

ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. పవన్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా పేరు 'అజ్ఞాతవాసి' అనేదే ఆ వార్త సారాంశం. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ లో పవన్ దీర్ఘాలోచన చేస్తూ .. శూన్యంలోకి నడుస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఏదో విషయంగా ఆయనలో అంతర్మథనం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో, కథ ప్రకారం ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ను ఎంపిక చేసినట్టుగా సోషల్ మీడియాలోను .. ఫ్యాన్స్ గ్రూపుల్లోను ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇది కేవలం ఊహాగానాల్లో నుంచి పుట్టిందా?.. లేదంటే నిజంగానే ఆ దిశగా ఆలోచనలు నడుస్తున్నాయా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. ఈ టైటిల్ నవలలకి బాగుంటుంది గానీ, స్టార్ హీరోల  సినిమాలకి బాగుండదు కనుక ఇందులో నిజం ఉండకపోవచ్చనే వారూ లేకపోలేదు.              

More Telugu News