: ఉస్మానియా యూనివర్శిటీలో ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటీలో ఘనంగా జరిగాయి. యూనివర్శిటీలోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జనసేన విద్యార్థి విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్ ఛార్జ్ వేమూరి శంకర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకును కట్ చేయడమే కాకుండా, విద్యార్థులకు మొక్కలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులు సామాజిక కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరమని అన్నారు. విద్యార్థుల సమస్యలపై చేపట్టే ఉద్యమాల్లో జనసేన, దాని అనుబంధ సంఘాలు పాల్గొంటాయని చెప్పారు. 

More Telugu News