: ఎంతో ఆరోగ్యంతో మరెన్నో పుట్టినరోజులు పవన్ జరుపుకోవాలి: రేణుదేశాయ్

అగ్రనటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘సమాజాన్ని పట్టించుకునే వారిలో, ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వారిలో అతను కూడా ఒకరు. ఎంతో ఆరోగ్యంతో మరెన్నో పుట్టినరోజులు ఆయన జరుపుకోవాలని కోరుకుంటున్నా’ అని రేణుదేశాయ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. పవన్ తో నాటి జ్ఞాపకాలను, తన చిన్ననాటి విషయాలను, తన పిల్లల గురించిన విశేషాలను రేణుదేశాయ్ పోస్ట్ చేస్తూ ఉండటం తెలిసిందే.

More Telugu News