: ప‌వ‌న్ కల్యాణ్ గురించిన కొన్ని విశేషాలు!

ఇవాళ 47వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి కానుక‌గా ఇరు రాష్ట్రాల అభిమానులు ప‌లు చోట్ల వేడుక‌లు నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి వారు గొప్పగా చెప్పుకోగ‌ల కొన్ని విష‌యాలు ఇవి:
1) ప‌వ‌న్ పూర్తి పేరు కొణిదెల క‌ల్యాణ్ బాబు. త‌న‌ క‌రాటే ప్ర‌ద‌ర్శ‌న కోసం పేరులో ప‌వ‌న్ జోడించుకున్నాడు.
2) క‌రాటేలో ప‌వ‌న్ బ్లాక్‌బెల్ట్ సంపాదించాడు. ఆయ‌న‌కు మార్ష‌ల్ ఆర్ట్స్ కూడా తెలుసు. త‌న సినిమాలు `జానీ`, `తీన్‌మార్‌`, `బ‌ద్రి` సినిమాల‌కు స్వ‌యంగా స్టంట్ కో ఆర్డినేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.
3) నిజానికి ప‌వ‌న్ ద‌ర్శ‌కుడు కావాల‌నుకున్నాడు. చిరంజీవి భార్య సురేఖ స‌ల‌హాతో న‌టుడిగా మారారు. 1996లో `అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి` సినిమాతో ప‌వ‌న్ తెరంగేట్రం చేశారు. ఈ సినిమా హిందీలో వ‌చ్చిన `ఖ‌యామ‌త్ సే ఖ‌యామ‌త్ త‌క్‌` రీమేక్‌.
4) 2003లో `జానీ` సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల కార‌ణంగా 250 థియేటర్ల‌లో విడుద‌ల చేశారు. తెలుగులో 250 థియేట్ల‌ర‌లో విడుద‌లైన మొద‌టి సినిమా ఇది.
5) ద‌క్షిణ భార‌త‌దేశం నుంచి `పెప్సీ` ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపించిన మొద‌టి న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.
6) 2013 ఫోర్బ్స్ టాప్ 100 సెల‌బ్రిటీల జాబితాలో ప‌వ‌న్ 26వ స్థానంలో నిలిచాడు. అలాగే 2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన భార‌త సెల‌బ్రిటీ పొలిటీషియ‌న్‌గా ప‌వ‌న్ నిలిచాడు.

More Telugu News