: రేపిస్ట్ బాబాకు మరో దెబ్బ.. గుర్మీత్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్!

అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వెరిఫైడ్ ట్విట్టర్ ఖాతాను పోలీసులు బ్లాక్ చేశారు. ఫలితంగా భారత్‌లోని ఆయన ఫాలోవర్లు గుర్మీత్ ఖాతాను చూడడం కానీ, యాక్సెస్ చేసుకోవడం కానీ చేయలేరు. అయితే విదేశాల్లో ఉన్న ఆయన ఫాలోవర్లు మాత్రం గుర్మీత్ పోస్టులను చూసే అవకాశం ఉంది. ట్విట్టర్‌లో గుర్మీత్‌కు 3.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. డేరా బాబా ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసినట్టు హరియాణా సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు గుర్మీత్ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేస్తే ‘‘"@Gurmeetramrahim's account has been withheld in: India." అనే మెసేజ్ దర్శనమిస్తోంది. గుర్మీత్ దత్త పుత్రికగా చెబుతున్న హనీప్రీత్ ఇన్సాన్ ఖాతా కూడా బ్లాక్ అయింది.

More Telugu News