Pawan Kalyan: పవన్ కల్యాణ్ అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ సర్ ప్రైజ్ గిప్ట్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ మూవీ రూపొందుతోంది. పవన్ కు ఇది  25వ సినిమా కాగా, ఈ మూవీకి అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలోని ‘త్రీ వో క్లాక్’ అనే సాంగ్ ను టీజర్ గా రిలీజ్ చేశారు. ఈ రోజు ఉదయం మూడు గంటలకు ఈ సాంగ్ ను రిలీజ్ చేయగా, అభిమానుల నుంచి స్పందన వస్తోంది.

 

More Telugu News