: ఆ ప్రయోగం జరపకుండా ఉత్తరకొరియాను ఆపే శక్తి చైనాకు మాత్రమే ఉంది: ఫ్రాన్స్

ఉత్తరకొరియా మరో బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచదేశాలకు చాలా ప్రమాదకరమని ఫ్రాన్స్ విదేశాంగశాఖ హెచ్చరించింది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఉత్తరకొరియాను నిలువరించాలని సూచించింది. అది కేవలం చైనాకు మాత్రమే సాధ్యమవుతుందని ఫ్రాన్స్ స్పష్టం చేసింది.

 అమెరికా, దక్షిణకొరియా, జపాన్ లను లక్ష్యం చేసుకుని ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోందని, అది ప్రపంచానికి ఏమాత్రం క్షేమకరం కాదని తెలిపింది. భవిష్యత్ లో కూడా ఈ ఉద్రిక్తతలు కొనసాగితే యుద్ధం వచ్చే అవకాశం ఉందని ఫ్రాన్స్ హెచ్చరించింది. చైనా వెంటనే ఉత్తరకొరియాతో మాట్లాడి క్షిపణి పరీక్షలు నిర్వహించకుండా నిలువరించాల్సిన అవసరం ఉందని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. అమెరికాతో పాటు యూరోప్ దేశాలను చేరుకోగల క్షిపణి పరీక్షలను కూడా ఉత్తరకొరియా చేస్తోందని ఫ్రాన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. 

More Telugu News