pavan: పవన్ .. త్రివిక్రమ్ మూవీ నుంచి రానున్న కాన్సెప్ట్ పోస్టర్

త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాకి, 'ఇంజనీర్ బాబు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రేపు పవన్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులను సర్ ప్రైజ్ చేయబోతున్నట్టు ఈ సినిమా టీమ్ ప్రకటించింది. దాంతో అంతా ఈ సినిమాపై దృష్టి పెట్టారు.

ఈ సినిమా నుంచి 'కాన్సెప్ట్ పోస్టర్' ను రిలీజ్ చేయనున్నట్టు కొంతసేపటి క్రితం చెప్పారు. అంటే .. ఇది ఫస్టులుక్ గానీ, టైటిల్ డిజైన్ లోగో కానీ కాదు. తమ సినిమా ఎలా ఉండబోతుందన్నది ఈ కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా చెబుతారన్న మాట. మరి కొన్ని గంటల్లోనే వదలబోతోన్న ఆ కాన్సెప్ట్ పోస్టర్, అభిమానులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.    

More Telugu News