: ప‌లు దేశాల్లో మొరాయించిన‌ వాట్సాప్‌... సోష‌ల్ మీడియాలో ఫిర్యాదుల వెల్లువ‌

యూర‌ప్, ఆసియా, ద‌క్షిణ అమెరికాలోని ప‌లు దేశాల్లో వాట్సాప్ యాప్ కొద్దిసేపు మొరాయించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆయా దేశాల వినియోగ‌దారులు సోష‌ల్ మీడియాలో ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల వెల్లువ‌కు వాట్సాప్ నుంచి ఎలాంటి స‌మాధానం రాలేదు. ట్విట్ట‌ర్‌లో `#వాట్సాప్‌డౌన్‌` పేరుతో వినియోగ‌దారులు ఫిర్యాదులు చేశారు. దుర‌దృష్ట‌క‌ర విష‌యం ఏంటంటే... వాట్సాప్‌కి అధికారికంగా ట్విట్ట‌ర్ అకౌంట్ ఉన్నా, కంపెనీ దాన్ని పెద్ద‌గా ఉప‌యోగించ‌దు. త‌మ ట్విట్ట‌ర్ అకౌంట్ 2016లో అప్‌డేట్ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆ అకౌంట్‌లో ఎలాంటి యాక్టివిటీ లేదు. అయిన‌ప్ప‌టికీ వాట్సాప్‌లో ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా వినియోగ‌దారులు ట్విట్ట‌ర్‌ని ఆశ్ర‌యిస్తారు. మొరాయించిన వాట్సాప్ ప్ర‌స్తుతం తిరిగి ప‌నిచేస్తోందని కొన్ని దేశాల వినియోగ‌దారులు చెబుతున్నారు. ఇలా వాట్సాప్ మొరాయించ‌డానికి కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు.

More Telugu News