: అబ్బాయిలు! ఆ జాబితాలో మీరు లేరు!: యాంకర్ అనసూయ

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో డైలాగ్స్ పై, సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యాంకర్ అనసూయ ఇటీవల విమర్శలు గుప్పించడం, ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడటం తెలిసిందే. అనసూయ ధరించే డ్రెస్ లు దారుణంగా ఉన్నాయని, రెచ్చగొట్టేందుకు ఈ తరహా డ్రెస్సులు ధరిస్తోందంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో యాంకర్ అనసూయ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది.

‘చాలా మంది మగవాళ్లు ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటారు..మహిళలు వారి కోసమే తయారవుతారని.
లిజన్ డ్యూడ్ ! మా షెడ్యూల్స్ , పీరియడ్స్ , మానసికావస్థ, స్థలాన్ని, కాలాన్ని, మేము కలవబోయే వ్యక్తులను, మ్యాచింగ్ షూస్, మ్యాచింగ్ బ్యాగ్, మ్యాచింగ్ లిప్ స్టిక్, సరిపడే లో దుస్తుల లభ్యత, మొదలైన వాటిని ఆధారంగా చేసుకుని  మేము ధరించే డ్రెస్ ఉంటుంది. ఈ జాబితాలో ‘మీరు’ లేరు. సో చిల్’ అని అనసూయ పేర్కొంది.

More Telugu News