: మేము వేరు.. మా బ్లడ్ వేరు!: నటుడు బాలకృష్ణ

సినీ నటులు రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘రాజకీయాల్లో రాణించడం ఒక్క నందమూరి తారక రామారావు గారికే సాధ్యమైంది. అమితాబ్ బచ్చన్ ఉన్నాడు..ఏం పీకాడు రాజకీయాల్లోకి వచ్చి? ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో బహుగుణ గారిని ఓడించి ఈయన పార్లమెంట్ కు వెళ్లాడు తప్పా. పార్లమెంట్ లో ఆటోగ్రాఫ్ లు, ఫొటోలు దిగడానికి తప్పితే ఎందుకు పనికొచ్చాడు? ఇక్కడ చిరంజీవి పరిస్థితి ఏమైంది?.. ఆర్టిస్ట్ అనేవాడు రాజకీయాల్లోకి రావొద్దని నేను సలహా ఇస్తున్నా’ అని అన్నారు.

‘మీరు హిందూపురానికి ఎమ్మెల్యే కదా, మరి, రాజకీయాల్లో మీరెలా..?’ అని ప్రశ్నించే లోపే బాలకృష్ణ స్పందిస్తూ, ‘మేము వేరు.. మా బ్లడ్ వేరు.. క్రెడిబిలిటీ ఉండాలి. సినిమా స్టార్ అయితే సరిపోదు. వేరే హీరోలు సినిమాల్లో చెప్పేవి డైలాగ్స్. నా విషయం లో అలా కాదు. నేనేం మాట్లాడాలనుకున్నానో అదే మాట్లాడతా. నాకు ఎవరైనా నచ్చితే నమస్కారం పెడతా, లేదంటే వాడు టాటా అయినా బిర్లా అయినా సరే, కేర్ చేయను. నా స్వభావమే అంత. నాది మా నాన్న బ్లడ్. నా సినిమాల క్యారెక్టర్ల ప్రభావమే నా స్వభావానికి కారణం’ అని బాలయ్య అన్నారు.

More Telugu News