: డేరా బాబా దత్తత కుమార్తె హనీ ప్రీత్ ఇన్సాన్ పై లుక్ ఔట్ నోటీసులు!

రేపిస్టు డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్తత కుమార్తె హనీ ప్రీత్ ఇన్సాన్ పై హర్యానా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. జైలులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తో పాటు ఉంటానని కోర్టులో వ్యాజ్యం వేసిన హనీ ప్రీత్ పై అభియోగాలు మోపారు. రేప్ కేసులో విచారణ ముగిసిన అనంతరం అతనిని తప్పించేందుకు ఆమె వ్యూహం రచించిందని, అందుకే రెడ్ కలర్ బ్యాగ్ వేసుకొచ్చిందని, దీంతోనే గుర్మీత్ ను దోషిగా న్యాయస్థానం పేర్కొనగానే అల్లర్లు చెలరేగాయని హర్యానా పోలీసులు ఆరోపించారు.

అలాగే ఆయనను తప్పించేందుకు వ్యూహాత్మకంగా భారీ కాన్వాయ్ తో ర్యాలీగా కోర్టుకు వచ్చారని కూడా తెలిపారు. వేరే దారిలో ఆయనను తరలిస్తుండగా, ఆయనను తీసుకు వెళ్లే వాహనాన్ని జీపుతో ఢీ కొట్టి అతనిని అపహరించేందుకు ప్రయత్నించారని, ఈ ఘటనల్లో ఆమె ప్రమేయం ఉందని చెబుతూ హర్యానా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా, డేరాబాబా ఆమెకు తండ్రి కాదని, వారిద్దరి మధ్య అంగీకార యోగ్యం కాని సంబంధం ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. 

More Telugu News